Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చక్రి బోళా శంకరుడు .. డబ్బు గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు : మహిత్ నారాయణ్

  • ప్రతి వ్యక్తినీ ప్రేమించడం చక్రి తత్వం
  • నన్ను ప్రాణంగా చూసుకునేవాడు 
  • సాంగ్స్ బాగా రావాలనుకునేవాడు 
  • పెద్ద సినిమాలకు కూడా పూర్తిగా డబ్బులు తీసుకోని సందర్భాలు వున్నాయి  
చక్రి మనస్తత్వం గురించి .. ఆయన స్నేహ భావం గురించి ఆయన సోదరుడు మహిత్ నారాయణ్ ఐ డ్రీమ్స్ తో చెప్పుకొచ్చారు. " అన్నయ్య నన్ను ఎంతో ప్రేమగా .. ప్రాణంగా చూసుకునేవాడు. ఆయనతో పరిచయమున్న ఏ వ్యక్తిని అడిగినా అలాంటి మంచి స్నేహితుడు గానీ .. ప్రేమికుడుగాని దొరకడని చెబుతారు. చక్రి కమర్షియల్ కాదు .. బోళా శంకరుడు .. అదే ఆయనకి మంచి అయింది .. అదే ఆయనకి చెడూ అయింది" అని అన్నారు.

 "తనని నమ్ముకుని వచ్చిన దర్శక నిర్మాతలకు ది బెస్ట్ ఇచ్చి పంపించాలనుకునేవాడు. సినిమా ఎంత పెద్దది .. మనకి ఎంత ఇస్తున్నారు? అనే విషయాలను ఆయన పట్టించుకునేవాడు కాదు. పెద్ద పెద్ద సినిమాలకి కూడా డబ్బులు పూర్తిగా తీసుకోకుండానే పనిచేసిన సందర్భాలు వున్నాయి. సాంగ్స్ బాగా వచ్చాయా? లేదా? అనే విషయాన్ని మాత్రమే చూసేవాడు. అందుకే కొన్ని సినిమాలు ప్లాప్ అయినా అన్నయ్య ఆడియోలు హిట్ గా నిలిచాయి. అందువల్లనే ఆయన సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు" అని చెప్పుకొచ్చారు.     
mahith narayan

More Telugu News